చైతన్యమై చేరగలవా ఆనందమై అందుకోగలవా
కలవై కనిపించగలవా స్నేహమై చేరువవుతవా
అభిమానమై హక్కున చేర్చుకుంటావా
ప్రేమై అల్లుకు పోతావా ప్రియతమా నీవెక్కడ…?
నా వూహకందని ఓ వరమా అందని జాబిలి నీవై
నను చూస్తువుంటావా అర్ధరాత్రివరకు నిద్రపోని
నా కనులకి కనిపించే ఆకశంలో వున్న ఓ చందమామ
ఎలా చేరగలను నిన్ను
………………………………………
సింహంలా గర్జిస్తూ నీ కోపాన్ని చూపిస్తావు
పులిలా గాండ్రిస్తూ నీవునికిని తెలియజేస్తావు
పాములా బుసకొడూతూ రక్షిస్తావు హంసలా నాలో
మంచి చెడులను వేరు చేస్తావు దేవుడిలా వరమిస్తావు
నా ప్రాణమై నను ప్రేమిస్తావు