telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్యపై సుప్రీం తీర్పును .. శిరసా వహిస్తామంటున్న ఆర్.ఎస్.ఎస్ …

అయోధ్య విషయంలో సుప్రీం తీర్పుకు కట్టుబడి వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదంపై నవంబర్‌ 17వ తేదీ లోపు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించనుంది. తీర్పు నేపథ్యంలో నవంబర్‌లో జరుగాల్సిన సంఘ్ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తూ ఆర్ఎస్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సేవకులంతా తమ పర్యటనలను రద్దు చేసుకోవాలని కూడా కోరింది. అయోధ్య కేసు వ్యవహారంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సంస్థ భావిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. తీర్పు తర్వాత, ఏదైనా జరిగితే, ఆ అపవాదు తమపై పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకూ హరిద్వార్‌లో జరగాల్సిన కీలక సమావేశాన్ని ఆర్ఎస్ఎస్ వాయిదా వేసింది.

ఐదేళ్లకు ఒకసారి జరిగే కీలకమైన సమావేశం ఇది. షెడ్యూల్ ప్రకారం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సురేష్ భయ్యాజీ, దత్తాత్రేయ హోసబలె, తదితర ముఖ్య నాయకులు హాజరు కావాల్సి ఉంది. పలువురు బీజేపీకి చెందిన నేతలు సైతం హాజరువుతారనే ప్రచారం జరిగింది. ఈ సమావేశంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన వ్యూహాలు లేదా నిర్మాణ తేదీల ప్రకటనపై చర్చించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. నవంబర్ 4న అయోధ్యలో జరగాల్సిన దుర్గా వాహిని క్యాంప్, 17న లక్నోలో జరగాల్సిన ‘ఏకల్ కుంభ్’ను కూడా ఆర్ఎస్ఎస్ రద్దు చేసింది. ప్రచారక్‌లు తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ తమకు నిర్దేశించిన సెంటర్లకే పరమితం కావాలని కూడా సంస్థ ఆదేశాలిచ్చినట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ నిబంధనలు సంస్థ అగ్రనేతలకు మాత్రం వర్తించవని చెప్పారు. మరోవైపు అయోధ్యకేసులో హిందూ అనుకూల తీర్పు అని తాజా వార్తలు చెప్పకనే చెపుతున్నాయి.

Related posts