telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌ న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటినా బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1010 తగ్గి రూ. 51,500 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 48,130 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 49, 630 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 45, 490 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే రూ. 4,700 తగ్గడంతో రూ. 65, 000కి చేరుకుంది.

Related posts