telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ్ కి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్..

Vijay-Devarakonda

తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండ అనే పేరు తెలియని వారు ఉన్న్డరు. పెళ్లి చూపులు చూస్తూ అందరికి దగ్గరైయ్యాడు. వెంటనే 2017లో అర్జున్‌గా సున్నా యాంగర్ మేనేజమెంట్‌తో పిచ్చెక్కించాడు. అంతమాస్‌గా ఉన్న వాడు కాస్తా గీతాగోవిందం సినిమాలో గీత కొంగు పట్టుకు తిరిగాడు. వెంటనే టాక్సీవాలాగా మారి రౌడీ రాజ్యాన్ని ఏర్పరిచాడు. అయితే ఈ హీరో ఇటీవల అల్లు అర్జున్ ఫొటోలను పంపాడు. ఆ ఫొటోలలో అర్జున్ స్టైల్‌గా, ఆవ్‌సమ్ లుక్‌తో ఉన్నాడు. దాంతో ఆ ఫొటోలు నిట్టింట హల్ చల్ చేశాయి. దాంతో అర్జున్ వాటిపై స్పందించాడు. దానికి అల్లు అర్జున్ సోదరుడు విజయ్‌ అలాగే రౌడీ క్లబ్‌ మీకు నా కృతజ్ఞతలు. ఇంత మంచి ఫోటోలను పంపినందుకు చాలా థాంక్స్ లవ్‌లీ బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు. అయితే దానిపై రౌడీ హీరో తిరిగి రిప్లై ఇచ్చాడు. స్టన్నింగ్ అన్నో అంటూ తన రౌడీ స్టైల్లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం అనన్య హీరోయిన్‌గా పూరీ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు మొదలుకాలేదు.

Related posts