telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే…?

Vijay Shyam Singa Rai

విలక్షణ కథలతో నాని ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అలరిస్తున్నారు. అయితే తాజాగా నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వీటిలో టక్ జగదీష్ ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి సరైన అప్‌డేట్ రాలేదు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అల్యుమినియం ఫ్యాక్టరీల్లో తెరకెక్కించారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు నాని పుట్టిన రోజు సందర్భంగా ఆ అప్డేట్ వస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నేడు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అలాగే నాని పుట్టిన రోజు కానుకగా తన మరో చిత్రం టక్ జగదీష్ నుండి నిన్న టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే చూడాలి మరి ఆ ఫస్ట్ లుక్ అభిమానులను అలరిస్తుందా… లేదా అనేది.

Related posts