కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో ఊహించని ట్రాన్స్ ఫర్మేషన్ తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడైన శింబు స్లిమ్ గా మారి, సరికొత్త లుక్ తో అందరికీ షాకిచ్చాడు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో 101 కేజీల బరువు నుంచి 70 కేజీలకు తగ్గడం గమనార్హం. తాజాగా బరువు తగ్గిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశాడు శింబు. ఈ పిక్స్ లో చాలా స్లిమ్ గా దర్శనం ఇచ్చాడు. అయితే ఇది కేవలం సినిమాల కోసం కాకుండా తాను పర్సనల్ గా అనుకొని తనని తను ఛాలెంజ్ చేసుకొని నిరూపించుకొనేందుకే చేసారట. ఇక ప్రస్తుతం శింబు హీరోగా నటిస్తున్న “ఈశ్వరుడు” చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
From 101 Kgs to 71 Kgs – What a Transformation by @SilambarasanTR_ pic.twitter.com/wrshTDHbaG
— Ramesh Bala (@rameshlaus) October 31, 2020