telugu navyamedia
క్రీడలు వార్తలు

మరోసారి తెరపైకి గిల్ ప్రేమాయణం…

సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌తో భారత యువ బ్యాట్స్‌మన్‌ శుభ్​మన్​ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా వారు పెట్టి కొన్ని పోస్ట్‌లు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన శుభ్‌మన్ గిల్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ‘మీరింకా ఒంటరిగానే ఉన్నారా? అని సదరు అభిమాని ప్రశ్నించగా… ‘అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ కలిసే ఆలోచనలు లేవు’ అని తనపై వచ్చే పుకార్లకు తెరదించాడు. అయితే, ఇలా రిప్లై ఇచ్చిన కామెంట్‌ను అతను తర్వాత తొలగించడం గమనార్హం. గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్‌గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Related posts