telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలోని ఆ జిల్లాలో క‌ర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠిన‌త‌రం…

lockdown hyd

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జిలాల్లో చిత్తూరు జిల్లా ఒక‌టి. అయితే రాష్ట్రంలో విధించిన నిబంధనల కంటే ఈ జిలాల్లో మరింత కఠినమైన నియమాలు విధించారు. చిత్తూరులో జూన్ 15వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ లో కోవిడ్ నియంత్రణపై మీడియాతో మాట్లాడారు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, నారాయణస్వామి.. చిత్తూరు జిల్లాలో క‌ర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠిన‌త‌రం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు పెద్దిరెడ్డి.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ప్రజలకు అవకాశం ఉంటుంద‌ని.. నిత్యావసరాల కొనుగోలుకు ఆ సమయం మాత్రమే ఇస్తామన్న ఆయ‌న‌.. జూన్ 1నుంచి ఈ ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు.. జిల్లాలో కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. చూడాలి మరి ఈ నిర్ణయంతో కేసులు తగ్గుతాయా… లేదా అనేది.

Related posts