telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

స్థానిక మార్కెట్ల వద్దనే అమ్మకాలు..తగ్గిన కూరగాయల ధరలు

Marketa rythu bazar Hyd

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రవాణ సౌకర్యాలు లేక రైతులు స్థానిక మార్కెట్ల వద్దనే కూరగాయలను విక్రయిస్తున్నారు. దీంతో  ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ ముందు రూ. 150 వరకూ ఉన్న ఉల్లి ధర, రూ. 80 వరకూ పలికిన మిర్చి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. నిబంధనల కారణంగా ఎగుమతులు లేక, పంటనంతా రైతులు స్థానిక మార్కెట్లకే తరలిస్తూ ఉండటంతో ధరలు భారీగా పడిపోయాయి.

ప్రస్తుతం హోల్ ‌సేల్‌ మార్కెట్ ‌లో 25 కిలోల టమాట బాక్స్ ధర రూ. 30కి పడిపోగా, రిటైల్‌ మార్కెట్ ‌లో రూ. 10కి రెండు కిలోలు, మూడు కిలోల చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. ఇక ఉల్లిగడ్డ విషయానికి వస్తే, 55 కిలోల బస్తా ధర రూ. 650 వరకూ తగ్గింది. అంటే, కిలో రూ. 12కు హోల్ సేల్ మార్కెట్లో లభిస్తుండగా, రూ. 50 కి మూడు కిలోల చొప్పున రిటైల్ మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్నారు.

Related posts