telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జనసేన

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ను సీఈసీ ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ తొలి జాబీతాను ఖరారు చేసింది. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తోంది. తాజాగా జనసేన 32 శాసనసభ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి జాబితాను సిద్ధం చేశారు. ఇందులో రెండు పార్లమెంటు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను జనసేన ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ లను పవన్ ఖరారు చేశారు. ఈ సాయంత్రంలోగా మిగిలిన అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

Related posts