telugu navyamedia
సినిమా వార్తలు

వేశ్యపాత్రపై రమ్యకృష్ణ స్పందన… ఒక సీన్ కోసం 37 టేకులు…

Ramya-Krishna

విభిన్నమైన, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ నటి రమ్యకృష్ణకు “బాహుబలి”లోని “శివగామి” పాత్రతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. దీంతో ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు రమ్యకృష్ణ. తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న “సూపర్ డీలక్స్” సినిమాలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ వేశ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు అసలు విషయమేంటంటే నటిగా ఎంతో అనుభవమున్న రమ్యకృష్ణ ఈ సినిమాలోని ఒక సన్నివేశం కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఈ చిత్రంలోని పాత్ర గురించి మాట్లాడుతూ “ఇది నా కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్… కొన్ని పాత్రలు పేరు కోసం… కొన్ని పాత్రలు డబ్బు కోసం… మరికొన్ని పాత్రలను ప్యాషన్ తో చేస్తాము… అలా ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది” అని చెప్పారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కుమార రాజా దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 29న తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది.

Related posts