telugu navyamedia
సినిమా వార్తలు

కొత్తదంపతుల జోష్… “రౌడీ బేబీ” అంటూ స్టెప్పులు

Arya-and-Sayyesha

వివాహ బంధంతో ఆర్య, సాయేషా సైగల్‌ ఒక్కటి కాబోతున్నారు. ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో సంగీత్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు తెలుపు వర్ణం దుస్తుల్లో అందంగా మెరిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సంగీత్‌లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను ఆర్య ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ప్రేమజంట వివాహానికి కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళి వేడుకలో కొత్త జంట డ్యాన్స్ చేస్తూ జోష్ ను పెంచారు. ధనుష్ సినిమాలోని “రౌడీ బేబీ” సాంగ్ కు డ్యాన్స్ స్టెప్పులేస్తూ అదరగొట్టారు. ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త జంటకు విషెష్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ‘గజినీకాంత్‌’ (2018) సినిమా కోసం ఆర్య, సాయేషా తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ప్రస్తుతం సాయేషా, ఆర్య కలిసి ‘కాప్పన్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Related posts