telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కశ్మీర్‌లో ఎన్ కౌంటర్..ముగ్గురు ముష్కర్లు హతం

kashmir police firing

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. త్రాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడ కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు తారసపడ్డారు.

తొలుత ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు కూడా ఉగ్రవాదులపై కాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు అన్సార్‌ గజ్వా ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులను జంగీర్‌ రఫిక్‌ వాణి, రాజా ఉమర్‌ మక్బుల్‌ భట్‌, ఉజైర్‌ అమీన్‌ భట్‌గా పోలీసులు పేర్కొన్నారు.

Related posts