telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటించడానికి అసలు కారణం ఇదే…!

Samantha

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. అంతేకాదు… నయనతార, సమంత కలిసి నటిస్తుండటం కూడా ఇదే ఫస్ట్ టైమ్. నయనతార, విజయ్ సేతుపతి కలిసి గతంలో నటించారు. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ‘‘కాతు వాకుల రెండు కాదల్’’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొత్త సినిమా వివరాలను సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత పలు విషయాలు తెలిపింది. ఆసక్తికర, విభిన్న కథల కోసం తాను ఎదురుచూస్తున్న సమయంలో తన వద్దకు ఈ సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని చెప్పింది. నయనతార, విజయ్ సేతుపతి పక్కన ఉత్తమంగా నటించడం ఒక సవాలుగా భావించానని తెలిపింది. ఈ కారణాల వల్లే తాను ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పానని వెల్లడించింది.

Related posts