telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ మళ్ళీ ఎన్టీఆర్ పాత్రలో కన్పించబోతున్నారా ?

no more movies in near future by balakrishna

నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి ఇటీవల తీసిన సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. తన తండ్రి బయోపిక్ కాబట్టి దీన్నో మధురజ్ఞాపకంగా మిగుల్చుకుందామని భావించాడు. అందుకే తానే నిర్మాతగా మారి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో అందరికీ తెలిసిందే. ఈ పరాజయం నుంచి బయటపడి ఇప్పుడు బాలకృష్ణ మళ్ళీ తన ఇమేజ్ కు నప్పే యాక్షన్ ఎంటర్టైనెర్స్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రూలర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ తనకు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ మరిచిపోదామనుకున్నా ఆ పాత్ర మరిచిపోనిచ్చేలా లేదు. చూస్తుంటే మళ్ళీ ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషించవచ్చు. ప్రస్తుతం తమిళంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకోసం బాలకృష్ణను సంప్రదించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో భాగస్వామి అయిన విష్ణు ఇందూరి, జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. మరి బాలకృష్ణ ఏం చేస్తాడు? మళ్ళీ ఎన్టీఆర్ లా వేషధారణ వేస్తె తను నిర్మించిన సినిమా తాలూకా జ్ఞాపకాలు గుర్తురావడం సహజం. మరి ఈ నేపథ్యంలో బాలయ్య ఎస్ చెబుతాడా నో చెబుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ కంటే శోభన్ బాబు పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం. శోభన్ బాబు – జయలలిత మధ్య ఏదో ఉందని, పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శోభన్ బాబు పాత్రకు ఎవరిని తీసుకుంటారు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.

Related posts