telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మిక పిక్ పై కలెక్టర్ కామెంట్… షాక్ లో నెటిజన్లు

Rashmika

యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఇటీవల జరిగిన “భీష్మ” ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా ఆ చిత్ర హీరోయిన్ రష్మిక మండన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముందు ఆమె ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. లాంగ్ లెంగ్త్ స్కర్ట్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫోటోలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఖాతా నుంచి ‘చించావు పో’ అనే కామెంట్ వచ్చింది. వెంటనే అందరూ ఆశ్చర్యపోవడంతో విషయం గుర్తించిన కలెక్టర్.. తన ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం విచారణ జరిపించాలని ఆదేశించారు.

Related posts