ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సోమవారం సుసైడ్ చేసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సూచన మేరకు ఆమె నేత్రాలను సేకరించారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా ఆమె వచ్చే వరకు అంత్యక్రియలు జరపలేదు. ఈ తెల్లవారుజామున 3గంటలకు విశాల హైదరాబాద్ చేరుకున్నారు.
అనంతరం హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. ఈ క్రమంలో సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఇతర కుటుంబసభ్యులు పాడె మోసి.. సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించారు.
ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తో పాటు నందమూరి కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు, అభిమానులు ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.