telugu navyamedia
సినిమా వార్తలు

“జెస్సీ” మా వ్యూ

Jessy Cinema Censored Got A Certificate
బ్యానర్ : ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి
న‌టీన‌టులు: అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ తదితరులు 
ద‌ర్శ‌క‌త్వం: అశ్విని కుమార్‌
నిర్మాత‌: శ్వేతా సింగ్‌
సంగీతం : శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌
కొరియోగ్రాఫ‌ర్‌: ఉద‌య్‌భాను (యుడి)
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌
సినిమాటోగ్రఫీ : సునీల్‌కుమార్‌.ఎన్‌
“జెస్సీ” టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఆ తరువాత వచ్చిన టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు ఇది హార్రర్ జోనర్ లో సాగే సినిమా అని అర్థమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “జెస్సీ” సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో చూద్దాం. 
క‌థ‌
ఇద్దరు అక్కాచెల్లెళ్లు జెస్సీ, అమీ. జెస్సీకి తన చెల్లెలంటే చాలా ఇష్టం. సాధారణంగా పుట్టిన‌ వారంద‌రికీ రోజురోజుకూ వ‌య‌సు పెరుగుతుంది. కానీ అమీకి మాత్రం త‌గ్గుతూ ఉంటుంది. ఆమె మాన‌సిక, శారీర‌క స్థితి రివ‌ర్స్ లో సాగుతుంది. దీంతో జెస్సీ తన బాయ్ ఫ్రెండ్ సాయంతో అమీని వైద్యుడి ద‌గ్గ‌రకు తీసుకెళ్తుంటుంది. అయితే అమీకి వ్యాధి నయం కాక‌పోగా, విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆ ఇంట్లోకి భూత‌వైద్యుడు ప్ర‌వేశిస్తాడు. అయితే అత‌ను అమీకి వైద్యం చేయడానికి బదులుగా జెస్సీని క‌ట్టివేసి, ఆమెకు న‌యం చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. ఇంత‌కీ వ్యాధి జెస్సీకా? అమీకా? అస‌లు భూత‌వైద్యుడు జెస్సీని ఎందుకు కట్టేశాడు? ఇంత‌కీ జెస్సీ అని చెప్పుకునే జెస్సీ ఎవ‌రు? త‌న అక్క కోసం తాప‌త్ర‌య‌ప‌డే అమృత‌కు, జెస్సీకి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది ? వంటి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే. 
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు : 
ఇది తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూస్తున్న హార్రర్ ఫార్ములానే. కానీ కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొన్ని ట్విస్టులతో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ క్లైమాక్స్ పేలవంగా సాగింది. స్క్రీన్ ప్లే కూడా ముందే ఊహించేవిధంగా ఉంది… సినిమాకు మైనస్ పాయింట్లు. అక్కడక్కడా డైలాగులు బాగున్నాయి. నేప‌థ్య సంగీతం సంగీతం భయపెడుతుంది. నటీనటుల నటన సినిమాకు ప్లస్ పాయింట్. రీరికార్డింగ్ వాస్త‌వానికి దూరంగా అన్పిస్తుంది. అతుల్ కుల‌క‌ర్ణి పాత్ర‌ను ఇంకాస్త బాగా రాసుకుంటే బావుండేది అన్పిస్తుంది. అయితే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. మరి మన తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  
రేటింగ్‌: 2/5 

Related posts