telugu navyamedia
సినిమా వార్తలు

రచయిత్రి సంచలన ట్వీట్.. స్పందించిన లైకా ప్రొడక్షన్స్

Lyca

ఇటీవ‌ల నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ త‌న‌కు ఇవ్వాల్ని రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం లేదంటూ ప్ర‌ముఖ త‌మిళ చిత్రాల‌కు స‌బ్ టైటిల్స్‌ను అందించే ర‌చ‌యిత్రి రేఖ్స్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. దీనిపై బుధ‌వారం నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. రేఖ్స్ ఆరోప‌ణ‌ల్లో నిజం లేదంటూ… ఆ మేరకు ఓ లేఖ‌ను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. “రేఖ్స్ సబ్ టైటిల్స్ కోసం రెండు ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. మేం అంత ఇవ్వ‌లేమ‌ని చెప్పాం. ఆమె తాను డిమాండ్ చేసిన మొత్తాన్ని మ‌న‌సులో ఉంచుకుని ప‌నిని పూర్తి చేశారు. ప‌ని చేయడానికి ముందు పారితోషకం గురించి త‌ర్వాత చ‌ర్చించుకుందామ‌ని చెప్పిన ఆవిడ‌.. రెండు ల‌క్ష‌ల ఇవ్వ‌మ‌ని అడిగారు. కానీ అందుకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఒప్పుకోలేదు. మేం ఆమెకు మార్కెట్ ధర ప్రకారం రూ.50వేల‌ను చెల్లించాం. దీంతో ఆమె మీడియాలో ఆరోప‌ణ‌లు చేశారు. మా సంస్థ పేరు చెడిపోకూడ‌ద‌ని ల‌క్ష రూపాయ‌లు ఆఫ‌ర్ చేసినా ఆమె ఒప్పుకోలేదు. అది మార్కెట్ ధర కాదు. మా సంస్థ కోసం పని చేసిన వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వ‌డంలో మేం ఆల‌స్యం చేయ‌లేదు. ఇప్పటికీ ఆమెకు ల‌క్ష రూపాయ‌లు ఇవ్వ‌డానికి సిద్ధంగానే ఉన్నాం. నిర్మాత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు పోగేసి సినిమా నిర్మిస్తారు. సింపుల్‌గా ఓ ట్వీట్‌తో ఇత‌రుల పేరుని దెబ్బ తీయ‌డం చాలా సుల‌భం. మా కోసం ప‌నిచేసిన వారికి విలువ ఇస్తాం. కానీ అర్హ‌త లేని మొత్తాన్ని డిమాండ్ చేస్తే ఇవ్వ‌డానికి సిద్ధంగా లేము” అని లైకా సంస్థ స్పందించింది.

Related posts