telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హరీష్ శంకర్ నిర్మాత బండ్ల పేరును అందుకే సైడ్ చేశాడా?

Harish-Shankar

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా‌లో “గబ్బర్ సింగ్” హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిన హరీష్ శంకర్ ఆ చిత్రంతో తనకున్న జ్ఞాపకాలను తెలియజేస్తూ ఓ లెటర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ లెటర్‌తోనే ఆయన కొత్త కాంట్రవర్శీకి శ్రీకారం చుట్టారు. అవును.. ఈ లెటర్‌లో అందరి పేర్లు ఉన్నాయి కానీ.. పవన్ కల్యాణ్‌ని దేవుడిలా కొలిచే, ‘గబ్బర్‌సింగ్’ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో హరీష్ శంకర్ మరోసారి వివాదానికి తెరలేపినట్లయింది.

పవన్ కల్యాణ్ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ చూపిస్తే.. పవన్ కల్యాణ్‌ని ఆరాధించే వ్యక్తి సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్‌సింగ్’తోనే చూపించాడు బండ్ల గణేష్. అలాగే అభిమానులందరూ సోషల్ మీడియాలో ‘గబ్బర్‌సింగ్’ ట్యాగ్‌‌తో రికార్డులు కొడుతుంటే.. బండ్ల గణేష్ ఆనందానికి అవధులే లేవు. అభిమానులను ఉత్సాహపరుస్తూ.. గబ్బర్‌సింగ్‌తో తనకున్న ‌జ్ఞాపకాలను బండ్ల షేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక తాజాగా హరీష్ విడుదల చేసిన లెటర్‌లో బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అందుకే హరీష్ శంకర్.. నిర్మాత బండ్ల పేరును సైడ్ చేశాడా? అనే అనుమానాలను పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే బండ్ల గణేష్‌తో పాటు ‘గబ్బర్‌సింగ్’ హీరోయిన్ శృతిహాసన్ పేరు కూడా హరీష్ శంకర్ ఇందులో ప్రస్తావించక పోవడం గమనార్హం.

Related posts