telugu navyamedia
సినిమా వార్తలు

సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో పోలీసుల పాత్ర ..?

సాయి ధరమ్ తేజ్ మోటార్ బైక్ ప్రమాదంతో అటు సినిమా రఁగం ఇటు సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఉలిక్కిపడ్డాయి .గతంలో కోట శ్రీనివాసరావు కుమారుడు, బాబు మోహన్ కుమారుడు , మాజీ క్రికెటర్ , మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీచేసింది న్ రెండవ కుమారుడు కూడా బైక్ ప్రమాదంలో మరణించారు .

Tollywood actor Sai Dharam Tej injured in road accident while riding a bike

హైదరాబాద్ నగరంలో ప్రయాణించే కార్లు , మోటార్ సైకిళ్ళు 50 కిలో మీటర్ల కంటే వేగంగా వెళ్లకూడదని ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు . ఒక వారం పాటు దీనిని పోలీసులు ప్రచారం చేశారు . ఆ తరువాత జూబిలీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ , గచ్చి బౌలి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో యువకులు మోటార్ బైక్ పై అత్యంత వేగంగా వెడుతున్నారనే వార్తలు వచ్చినా ట్రాఫిక్ పోలీసులు దీనిపై సరైన ద్రుష్టి పెట్టలేదు .

హైద్రాబాద్ లో ముఖ్యంగా జూబిలీహిల్స్ , మాదాపూర్ , గుచ్చి బౌలి , ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు వున్నాయి . ప్రమాదం జరిగి ప్పుడు తప్పపోలీసులు మిగతారోజుల్లో ఇలా స్పీడుగా వెళ్లే వాహనాలను గుర్తిండంలేదనే విమర్శలు వున్నాయి . హైదరాబాద్ నగరం ఇప్పుడు అన్నిరకాలుగా వేగంగా విస్తరిస్తోంది . ఈ నగరంలో ట్రాఫిక్ కూడా సమస్యాత్మగా మారుతుంది . ఇలాంటి తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ సరైన నిఘా ఉంటుందా ? .

Actor Sai Dharam Tej Survives Scary Bike Accident, All Well Now

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం ఇప్పుడు అటు సినిమా రంగాన్ని , ఇటు పోలీస్ యంత్రాగాన్ని కూడా నివ్వెరపోయేలా చేసింది . సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన వెంటనే గుర్తించి అంబులెన్సుకు సమాచారం ఇవ్వడం వల్ల అతని ప్రాణానికి ముప్పు ఏర్పడలేదు . సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవికి స్వయంగా మేనల్లుడు ..సోదరి కుమారుడు .. అందుకే అపోలో ఆసుపత్రికి తరలించి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు . అపోలో ఆసుపత్రి చిరంజీవి కోడలు ఉపాసన కు చెందింది కాబట్టి అత్యున్నతమైన వైద్యం అందుతోంది .

 

ఈ ఘటన తరువాత పోలీసులు కేసును బుక్ చేసి , సాయి ధరమ్ తేజ్ కు కారు నడపడానికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని , మోటర్ సైకిల్ నడపడానికి లైసెన్స్ లేదని చెబుతున్నారు. పైగా తేజ్ నడిపిన ఆ బండిని ఇంకొక అతని దగ్గర కొనుగోలు చేశాడని , తేజ్ పేరు మీద మార్చుకోలేదని పోలీసులు వెల్లడించారు . ఈ సంఘటన కు మీడియా పెద్ద హడావిడి చేసింది . తేజ్ హీరో , చిరంజీవి మేనల్లుడు కాబట్టి , సినిమారంగ ప్రముఖులు కూడా ఈ సంఘటనపై పరస్పర ప్రకటనలు చేసుకోవడం విడ్డూరమనిపించింది.

Sai Dharam Tej Injured In Road Accident, Unconscious -

ఇప్పటికైనా యువకుల మోటారు సైకిళ్ళ రైడింగ్ మీద నగర పోలీసులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి, సీసీ కెమెరా లను పరిశీలిస్తూ అతి వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానా మరియు కేసులను నమోదు చేసి అరికట్టాలిచ్చిన అవసరం ఎంతైనా వుంది.

Related posts