telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందుకే తమన్నా ముద్దు సీన్లకు దూరం

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగుతోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇరు భాషలకు చెందిన పలువురు అగ్ర హీరోల సరసన నటించింది. హిందీలోనూ పలు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్‌ కూడా చేస్తోంది. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోని తమన్నా.. తెరపై ముద్దు సీన్లకు మాత్రం మొహమాటం లేకుండా “నో” చెప్పేస్తుంది. తాజాగా తన నియమం గురించి తమన్నా స్పందించింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ “తెరపై ముద్దు సీన్లకు నేను దూరం. దానికి పెద్ద కారణాలేం లేవు. నేను చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేశాను. నా తొలి సినిమా సమయానికి నా వయసు 13. ముద్దు సీన్లలోనూ, ఇంటిమేట్ సీన్లలోనూ నటించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా నిర్ణయాన్ని మార్చుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు” అని తమన్నా చెప్పింది.

Related posts