telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గాడిదను పెంచుకుంటున్న స్టార్ హీరో

Arnald

హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఆస్ట్రేలియన్ – అమెరికన్ స్టార్ యాక్టర్ అయిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ గతంలో కాలిఫోర్నియాకు గవర్నర్ గా కూడా వ్యవహరించారు. 72 ఏళ్ల ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఇప్పటికి కండలు తిరిగిన దేశంతో అదరగొడుతున్నాడు. ఇక ఈ కండల వీరుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవల తన కూతురు తల్లికాబోతుందన్న వార్తను అభిమానులతో పంచుకొని సంబరపడ్డారు ఆర్నాల్డ్. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆర్నాల్డ్ వర్కౌట్స్ మాత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాడు. తాజాగా ఆయన వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో తన పెంపుడు గాడిద కూడా ఉంది. ఆర్నాల్డ్ వర్కౌట్స్ చేస్తుంటే “లులు” అనే ఆ గాడిద జిమ్ అంతా తిరుగుతూ… ఆర్నాల్డ్ చేస్తున్న వర్కౌట్స్ ను ఎంతో శ్రద్ధగా చూస్తోంది.

Related posts