మలయాళీ కుట్టి నిత్యామీనన్ “అలా మొదలైంది” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పద్ధతిగా మెలిగే పాత్రలనే చేసుకుంటూ వచ్చింది. ఈ బబ్లీ బ్యూటీతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అందరూ కండిషన్స్ ఏమి పెట్టుకోకుండా క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు. కానీ నిత్యా మాత్రం వాటికి దూరంగానే ఉంటూ వచ్చింది. ఇకపోతే హిందీలో ”బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సడన్ గా లిప్ లాక్ సీన్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.‘బీత్ ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో నిత్యమీనన్ లెస్బియన్‌గా నటించింది. తాజాగా మరో వెబ్ సిరీస్ కు నిత్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అవసరల శ్రీనివాస్ భారీ బడ్జెట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాలని నిత్యా మీనన్ ని అడిగారట. కొన్ని చర్చల అనంతరం ఈ సిరీస్ చేయడానికి నిత్యా ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ నిర్మించనుంది.
previous post
next post