telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్ కామెంట్స్.. నాగబాబును ఉద్దేశించేనా…?

Puri

సినిమా పెద్దలంతా కలిసి మంత్రి తలసానితో జరిపిన మీటింగ్ పై బాలకృష్ణ వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఒక వీడియో ద్వారా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాద్ చేసిన ట్వీట్ ఇప్ప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ లో పూరీ “అతి పెద్ద జంతువు’ ఏది అని అడిగితే నేను ‘ఏనుగు’ అని చెప్పడం విన్నాను. ‘పొడవైన జంతువు’ ఏదీ అని అడిగితే నేను ‘జిరాఫీ’ అని చెప్పడం విన్నాను. తెలివైన జంతువు ఏది అని అడిగితే నేను ‘నక్క’ అని చెప్పడం విన్నాను. వేగంగా పరిగెత్తే జంతువూ ఏదని అడిగితే నేను చిరుత అని చెప్పడం విన్నాను. ఇప్పటి దాకా చెప్పిన వండర్ ఫుల్ క్వాలిటీస్ లో ‘లయన్’ లేదు కదా అంటే.. లేకపోతే ఏంటి ‘సింహం’ ‘అడవికి రాజు’ అని మీరు అంటున్నారు. ఎందుకంటే ‘సింహం’ ధైర్యవంతుడు.. బోల్డ్.. కాన్ఫిడెంట్ గా నడుస్తుంది. సింహం ప్రతీదాన్ని దాన్ని డేర్ గా ఎదుర్కొంటుంది ఎవరికీ భయపడడు. నన్నెవరూ ఆపలేరని భావిస్తుంది. మనం సింహం నుండి ఏమి నేర్చుకోవాలి? నీకు కావాల్సింది ‘ధైర్యం’ నీపైన మీకున్న నమ్మకం. నీలో కూడా ఒక సింహం ఉన్నాడు” అంటూ ఆ వీడియో సాగింది. ఈ వీడియో బాలయ్యను ఉద్దేశించి పూరీ పోస్ట్ చేసాడని, నాగబాబుకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడని బాలయ్య అభిమానులు అనుకుంటుండడం గమనార్హం.

Related posts