పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్, ఫస్ట్‌సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ సాగే పాట పవన్ పాత్రను హైలైట్ చేస్తూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు.
ఆదివారం త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి టైటిట్ సాంగ్‌ను నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సాహిత్యం త్రివిక్రమ్ అందించగా… అరుణ్ కౌండిన్య ఆలపించాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు.
సాగర్.కె.చంద్ర దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.