బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్ సమయంలో పీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఆయన రోజువారి ఉపాధి పొందే కార్మికులకి అండగా నిలిచారు. ఇక పన్వెల్ ఫాం హౌజ్ పరిసరాలలో ఉన్న పేద ప్రజలకి నిత్యావసరాలు పంచారు. ఈద్ పండుగ సందర్బంగా ఐదు వేల కుటుంబాలకి పాయసం కిట్స్ అందించారు. తాజాగా సల్మాన్ థియేటర్ కళాకారుల కోసం ముంబై ఆడిటోరియంలో ఆహార విరాళంకి సంబంధించిన కార్యక్రమం ప్రారంభించాడు. గత ఆదివారం, సల్మాన్ ఖాన్ రెండు ఆహార ట్రక్కులను పరేల్‌లోని దామోదర్ నాట్యగ్రూహాకు, కార్మికుల కోసం దాదర్‌లోని శ్రీ శివాజీ మందిర్ నాట్యగ్రూహాకు పంపారు. ఇటీవల ముంబై పోలీసు విభాగానికి హ్యాండ్ శానిటైజర్లను కూడా విరాళంగా ఇచ్చాడు సల్మాన్ భాయ్.
previous post
next post