telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్

C.kalyan

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ లో భాగంగా అన్‌లాక్‌-3.0 ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రకటించింది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ (ఆగస్టు 23) ఆదివారం ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ జరిగే సమయంలో లొకేషన్‌లో ఎవరెవరు ఎలా ఉండాలో చెబుతూ కొన్ని గైడ్‌లైన్స్‌ను కేంద్రం విడుదల చేసింది. షూటింగ్ లొకేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, అలాగే అందరూ విధిగా మాస్క్ ధరించాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కెమెరా ముందు నటించే నటీనటులు తప్పితే మిగిలిన వారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. అలాగే థియేటర్స్‌లో సిట్టింగ్ విషయంలో కూడా గైడ్‌లైన్స్‌ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితులు షూటింగ్స్‌కి అనుకూలించవని, కేంద్రం అనుమతులు ఇచ్చినా షూటింగ్స్ చేయడం సాధ్యం కాదంటూ టాలీవుడ్ నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేదాకా ధైర్యంగా నటీనటులు సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం షూటింగ్స్ చేయడం చాలా కష్టమని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ కుండబద్దలు కొట్టేస్తూ మాట్లాడారు సి. కల్యాణ్.

Related posts