ఈసారి ఆస్కార్ నామినేషన్ లో తెలుగు సినిమాకి వస్తుందని అందరూ భావించారు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ ఆస్కార్ లైన్ లో నిలబడుతుందని అనుకున్నారు. మహిళా సమస్యలను చాల సున్నితంగా చూపెట్టిన విధానం చేత ఈ సినిమా భారత ఆస్కార్ ప్రాబబుల్స్ లో చోటు సంపాదించింది. దాంతో సోషల్ మీడియాలో డీయర్ కామ్రేడ్ ఈసారి ఆస్కార్ నామినేషన్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకుంటుందని అందరూ భావించారు. విదేశీ సినిమాల కోటాలో భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ రేసులో 28 సినిమాలు నిలిచాయి. ఈ 28 మూవీస్ లో తమిళ్ నుంచి 3 సినిమాలు ఉండడం విశేషం. తాజాగా అధికారికంగా విడుదలైన ప్రకటన ప్రకారం భారతదేశం నుంచి ఆస్కార్ కు గల్లి బాయ్ సినిమా నామినేట్ అయ్యింది. ముంబాయి వీధుల్లో ఓ గల్లీ పోరడు ర్యాప్ సాంగ్స్ తో ఎలా అలరించాడు..అతడు ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అన్న ఇతివృత్తమే గల్లీబాయ్. ఈ మూవీలో సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. అంతే కాదు పూర్తిగా మాస్ ఎంట్రటైన్ మెంట్ గా తెరకెక్కింది.
రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ మిగిలిన 27 చిత్రాలను తోసిరాజేసి భారతదేశం తరుపున నామినేట్ అయ్యింది. అంతే కాదు అంధధూన్, ఆర్టికల్ 15 వంటి ఎన్నో విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు కూడా నామినేట్ అయ్యేందుకు పోటీపడ్డాయి. అయితే వీటన్నింటిని దాటుకొని చివరకు జోయా అక్తర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ భారతదేశం నుంచి అధికారిక ఆస్కార్ ఎంట్రీగా నిలిచింది. ఇదే సమయంలో తెలుగు నుండి డియర్ కామ్రేడ్ మాత్రమే పరిశీలన జాబితాలో చోటు దక్కించుకుంది. కానీ, గల్లీబాయ్ కే ఆస్కార్ నామినేషన్ అదృష్టం దక్కింది. ఇండియన్ రాపర్స్ డివైన్, నాజి ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతపెద్ద సక్సెస్ కాలేకపోయినా, కానీ ఆస్కార్ కు మాత్రం నామినేట్ కాలేకపోయింది.