telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కమ్మరాజ్యంలో కడపరెడ్లు కాదు.. పప్పువర్మ నోట్లో నలిగిపోతున్న సంస్కృతీ.. : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

jonnavithula fire on varma

వివాదాల వర్మ మరో విమర్శను నెత్తిమీదకు తెచ్చుకున్నాడు. సాధారణంగా ఆయన చిత్రాల కోసం ప్రత్యేక ప్రచారం అంటూ ఏది చేయకుండా, కొత్తకొత్త వివాదాలు లేవనెత్తి వాటినే ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటుంటాడు. అదే తరహాలో ఆయన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు పై కూడా అనేక వివాదాలు సృష్టించాడు. అయితే తెరవెనుక తాను ఉన్నట్టు అందరికి తెలిసిన రహస్యమే.. అయినప్పటికీ ప్రచారమే ఆయనకు పరమావధి. అది సజావుగా సాగుతూనే ఉంది. సినిమా ప్రచారం అంటే ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకొంటుండటం పరిశ్రమలో ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. అలాగే ఈ చిత్రానికి కూడా జొన్నవిత్తుల రామలింగేశ్వరరరావు గానికి కాల్ చేసి మరీ అభిప్రాయాన్ని అడిగారు. ఆయన కూడా అడిగారు కదా అని మర్యాద కోసమైనా చిత్ర టీజర్ చూసి టెక్నికల్ గా బాగుంది అన్నారు, కానీ కధాపరంగా విషయం శూన్యం అని చెప్పారు.

అంతటితో ఆగితే బాగానే ఉండేది, జొన్నవిత్తుల అభిప్రాయం పై వర్మ స్పందన నిర్లక్ష్యంగా ఉండటంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించారు. అభిప్రాయం అడగటం ఎందుకు, దానిని నిర్లక్ష్యం చేయడం ఎందుకు అని ముఖం మీదే అడిగేశారు, కడిగేశారు అనాలేమో! జొన్నవిత్తుల స్పందన .. మీ చిత్ర ప్రచారం కోసం నా అభిప్రాయాన్ని అడిగి, దానిని కూడా సరిగా వెనలేకపోడవం తోనే నీకు ఆయా పనుల పట్ల ఉన్న నిబద్దత తెలియజేస్తూనే ఉంది. ఈ దేశంలో పుట్టి, సంస్కృతిని నాశనం చేసేందుకు పుట్టిన వాళ్లలో ప్రముఖుడివి. అందుకే సమాజంలో జీవిస్తూ కూడా దానితో నాకు పనిలేదు అంటుంటావు. ఎన్నో విషయాలలో అలనాటి రాక్షసులు కూడా నిష్ణాతులే అందుకని వారిని ఎవరు ఆదర్శంగా తీసుకోని బ్రతకరు. అటువంటి నువ్వు గొప్పగొప్ప వారిని విమర్శించడం వింటుంటేనే ని బ్రతుకేమిటో అర్ధం అవుతూనే ఉంది. నాకు చౌదరి అని కులాన్ని ఆపాదించినప్పుడే నీకు కూడా చక్కటి పేరు ‘పప్పువర్మ’ అని పెట్టేశారు. నా జీవితంలో వీలైనప్పుడు ఖచ్చితంగా అదే టైటిల్ గా నీ బయోపిక్ పేరడీ తీస్తాను, నీ బ్రతుకేమితో అందిరికి చూపిస్తాను అన్నారు. మొత్తానికి వర్మ నిర్లక్ష్యంతోనే సినిమా ప్రమోషన్స్ చేయించుకుంటున్నాడు.

Related posts