telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంతకు ప్రేమలేఖ… మీ అమ్మ తప్పకుండా నన్ను తిడుతుంది అంటున్న “జాను”

Samantha

తాజాగా సమంత తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ “96” రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ‘జాను’ విపరీతంగా నచ్చేయడంతో ఓ అభిమాని ‘సామ్ ఐ లవ్ యు.. జాను ఐ లవ్ యు’ అంటూ.. ఏకంగా మూడు గంటల పాటు పుస్తకంలో ప్రేమలేఖ రాసేశాడు. దాన్ని వీడియో తీసి సమంతకు చేరేలా ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో వదిలిపెట్టాడు. ఆ ప్రేమలేఖ సోషల్ మీడియా పుణ్యమా అని సమంతకు చేరడంతో ఆ అమర ప్రేమికుడికి తిరిగి తన సందేశాన్ని పంపించింది. “ఓ.. ఖచ్చితంగా మీ మమ్మీ నన్ను తిడుతుంది.. నీ అభిమానానికి థాంక్స్‌.. ముందు చదువుకోమ్మా” అంటూ ఆ విద్యార్ధికి ఫన్నీ ఆన్సర్ ఇస్తూ లవ్ సింబల్ ఎమోజీని షేర్ చేసింది సమంత. ఇంతకీ ఆ ప్రేమికుడు ట్విట్టర్ పేజ్‌ కూడా సృసామ్ అనే పెట్టుకోవడం విశేషం. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Related posts