telugu navyamedia
సినిమా వార్తలు

అఖిల్ నాల్గవ సినిమా ప్రారంభం

Akhil

అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందనిద్రాక్షగా మారింది. “అఖిల్”, “హలో”, “మిస్టర్ మజ్ను” చిత్రాల తర్వాత అఖిల్ చేయబోతున్న నాల్గవ చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, అల్లు అరవింద్, అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతోనైనా అఖిల్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారేమో చూడాలి.

Related posts