లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (CCC)కి పలువురు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిందామె. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ సినీ కళాకారులను, కార్మికులను ఆదుకోవడానికి కథానాయికలెవరూ ముందుకు రావడం లేదని పలువురు ఆరోపించారు. కాగా CCCకి ఇంతకుముందు లావణ్య త్రిపాఠి, ప్రణీత చెరో లక్ష రూపాయల విరాళమిచ్చారు. అయితే సౌత్‌లో స్టార్ కథానాయికగా కొనసాగుతూ సినిమాకు రూ.కోటి వరకు పారితోషికం తీసుకునే కాజల్ కేవలం రెండు లక్షలు ఇవ్వడమేంటి అనే మాటలు కూడా వినబడుతున్నాయి.
previous post
next post
53 ఏళ్ల సల్మాన్‌తో 21 ఏళ్ల యువతి రొమాన్స్…. సోనాక్షి కామెంట్స్