telugu navyamedia
సినిమా వార్తలు

మళ్ళీ ఆగిన “లక్ష్మీస్ ఎన్టీఆర్”… వెనుక ఉన్న శక్తులెవరో తెలుసంటున్న వర్మ

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదలను ఏపీలో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల కారణంగా సినిమా విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తి కావడంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. గతంలో కోర్టు పోలింగ్ పూర్తయిన అనంతరం సినిమాను విడుదల చేయొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి కావడంతో సినిమా విడుదలకు ప్లాన్ చేశారు చిత్రబృందం. కానీ ఇప్పుడు కూడా సినిమా విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పడంతో వర్మ మండిపడ్డారు. గతంలో కోర్టు ఇచ్చిన ఈసీ లేఖను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని, ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న శక్తులెవరో అందరికీ తెలుసంటూ ట్వీట్ చేశారు.

Related posts