telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ ప్రశ్నకు చేతులెత్తి దండం పెట్టేసిన బండ్ల గణేష్

bandlaganesh request on movie event

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించారు బండ్ల గణేష్. ఆ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరిన బండ్ల గణేష్… గత ఎన్నికల సమయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనదైన స్టైల్ కామెంట్స్, ప్రభుత్వంపై విమర్శలతో నానా రచ్చ చేశారాయన. ముఖ్యంగా కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, 7’O క్లాక్ బ్లేడ్ ఇష్యూ అయితే ఎప్పటికీ జనం మరచిపోలేరు. ఇంత చేసినా ఆశించిన ఫలితం రాక, ఘోరంగా విఫలం కావడంతో యూ టర్న్ తీసుకొని తిరిగి సినిమాల వైపు చూస్తున్నారు బండ్ల గణేష్. ఇక బిజినెస్‌మెన్‌గా, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మనోడు చెప్పే ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ కావడంతో ఏదో ఒక రూపంలో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ బండ్ల గణేష్‌ని ట్యాగ్ చేస్తూ ఓ ఆసక్తికర ప్రశ్న సంధించడంతో వెంటనే తనదైన రియాక్షన్ ఇచ్చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అన్నా.. బీజేపీలో చేరుతున్నావా? అని ఆ నెటిజన్ అడగడంతో బండ్ల గణేష్ వద్దు బాబోయ్ అంటూ.. సింపుల్‌గా ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అని పేర్కొంటూ చేతులెత్తి దండం పెట్టడం హాట్ టాపిక్ అయింది.

Related posts