telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ కరోనా అప్డేట్‌ : ఈరోజు ఎన్ని కేసులంటే ?

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.67 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. తాజా నివేదిక ప్రకారం ఏపీలో కరోనా కేసులు చాలా తగ్గాయి. అందులో ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,67, 063 కి చేరింది. ఇందులో 8, 48, 511 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 11, 571 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 05 మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6981 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 21, చిత్తూరులో 61, తూర్పుగోదావరి జిల్లాలో 54, గుంటూరులో 68, కడపలో 19, కృష్ణాలో 103, కర్నూలులో 22, నెల్లూరులో 24, ప్రకాశంలో 27, శ్రీకాకుళంలో 16, విశాఖపట్నంలో 88, విజయనగరంలో 29, పశ్చిమ గోదావరిలో 93 కేసులు నమోదయ్యాయి.

Related posts