telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్

Dil-raju

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.34 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇది ఇలా ఉండగా.. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు. వకీల్ సాబ్ మూవీ ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా ఆడియన్స్ తో కలిసే ఉన్నాడు. సాధారణ అభిమానులతో కలిసి దిల్ రాజు థియేటర్ లో పేపర్లు ఎగురవేయడం కూడా చూశాం. ఇది ఇలా ఉండగా తాజాగా దిల్ రాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్ళందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని దిల్ రాజు కోరారు. కాగా.. ఇటీవలే వకీల్ సాబ్ మూవీ భామ నివేదా థామస్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Related posts