telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళు కేవలం పడకసుఖం కోసమే… కాస్టింగ్ కౌచ్ పై రాయ్ లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

Lakshmi-Rai

‘క్యాస్టింగ్ కౌచ్’ ఉదంతం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా చాలామంది నటీమణులు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయం గురించి బయటపెట్టారు. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వారి బండారం ఈ ఘటనతో బయటపడింది. తాజాగా హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తన ఎంట్రీ సాఫీగానే జరిగిందని, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారు, బ్రేక్ కోరుకునేవారే దర్శక నిర్మాతల చేతిలో మోసపోతున్నారని.. కేవలం అటువంటి వారి వల్లే చిత్రపరిశ్రమపై నెగెటివిటీ ఏర్పడుతుందని ఆమె చెప్పింది. ఆర్టిస్టుల ఆర్థిక పరిస్థితిని బట్టి వారి పర్సనల్ ఖర్చులు భరించడం వారితో పడుకోవడం దాని ద్వారా వారికి అవకాశాలు ఇప్పించడం వంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కేవలం పడకసుఖం కోసమే పేరొందిన ఆర్టిస్టులను అప్రోచ్ అవుతుంటారు. ఒకవేళ వారు అడిగినదానికి ఒప్పుకోకపోతే ఆ ఆర్టిస్టుని ప్రాజెక్టులోనుంచి తీసేస్తారు అంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది రాయ్ లక్ష్మీ.

Related posts