telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫోన్ పట్టనున్న నిత్యామీనన్ ?

Nitya

టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్లలలో ఒకరుగా నిత్యామీనన్ పేరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు విధించుకుని, వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది. నిత్యామీనన్‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే.. ఆమెను ఒప్పించడం చాలా కష్టం. అయితే ఇప్పుడు నిత్యామీనన్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టాలని అనుకుంటుందట. తన సినిమాల షూటింగ్స్‌లో బ్రేక్ వచ్చినప్పుడు కెమెరామెన్ పనితనం, దర్శకుడి విజన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుందట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా దర్శకత్వం గురించి నిత్యామీనన్ మాట్లాడింది. త్వరలో ఆమె మెగా ఫోన్ పట్టే అవకాశాలు లేకపోలేదు. తను దర్శకత్వం చేసేందుకు కొన్ని కథలను కూడా ఈ లాక్‌డౌన్‌లో ఆమె సిద్ధం చేసుకుందట. అన్ని కుదిరితే ఆమె దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమాను తెరకెక్కించడం ఖాయం అంటున్నారు.

Related posts