telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మొబైల్ లో మునిగిపోయి ఏకంగా సిగ్నల్ ను గుద్దేసిన డ్రైవర్

Car

సౌదీలోని అబుధాబిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మొబైల్ చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్న ఓ యువతి కారు ఎటుగా వెళ్తుందో పట్టించుకోలేదు. దాంతో అదుపుతప్పిన ఆ కారు.. దారి తప్పి ఎదురుగా వచ్చిన ఓ సిగ్నల్ లైటును ఢీకొంది. ఆ వెంటనే రోడ్డును క్రాస్ చేసి ఆవలి పక్కన చెట్టుకు గుద్దుకుంది. ఈ ప్రమాదం మొత్తం రోడ్డుపై ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన అధికారులు.. డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ చూడటం, పుస్తకాలు చదవడం వంటి పనులు చేయొద్దని సూచించారు. ఇలాంటి ప్రమాదాలకు అవే కారణమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదృష్టం బావుండి వీడియోలోని కారు వేరే వాహనాలను ఢీ కొట్టలేదు. అదే జరిగితే ఎవరో ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని అధికారులు చెప్పారు. డ్రైవింగ్ చేస్తున్న యువతి మొబైల్ ఫోన్ చూస్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలియజేశారు.

Related posts