telugu navyamedia
సినిమా వార్తలు

‘మధుర నగరిలో’ పెళ్లి సందD సంద‌డి సంద‌డిగా..

హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోషన్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్ గా గౌరీ రొనంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రం కి ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో తొలిసారిగా రాఘవేంద్ర రావు నటిస్తున్నారు.

Pelli SandaD' to release in September 2021 | Telugu Movie News - Times of  India

ఈ చిత్రం నుండి ఇటీవ‌ల విడుదల అయిన ఫోస్ట‌ర్స్‌, పాటలు, వీడియోలు ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘మధుర నగరి’లో అంటూ ఒక పాట విడుదల అయ్యింది. ఈ పాట ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాట ను శ్రీనిధి, నాయన నైర్ మరియు కాల భైరవ లు గాత్రం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

Raghavendra Rao Locks Roshan For Pelli SandaD -

‘పెళ్లి సందD’ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో షకలక్ శంకర్, శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Related posts