“90ఎమ్ఎల్” సినిమాతో ఓవియా విమర్శలను ఎదుర్కొంటోంది. బిగ్ బాస్ సెన్సేషన్ గా నిలిచిన ఓవియా తాజా చిత్రం “90ఎమ్ఎల్”. అడల్డ్ కామెడీతో కూడిన టీజర్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఏ జోకులు, అశ్లీల దృశ్యాలతో ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంపై వస్తున్న విమర్శలపై ఓవియా స్పందించింది. తాను నగ్నంగా ఏం నటించలేదని… గ్లామర్ గా మాత్రమే కన్పించానని, అయినా మహిళలు సినిమాల్లో ఇలాంటి దుస్తులే వేసుకోవాలన్న నిబంధన ఏం లేదుగా… తన లిమిట్స్ తనకు తెలుసునని… కాబట్టి విమర్శలు పక్కన పెట్టి ఎవరి పనులు వారు చూసుకుంటే మంచిది అంటూ ఫైర్ అయ్యింది ఓవియా.
ఇక తమిళ హీరో శింబుతో ఓవియా ప్రేమాయణంలో ఉన్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. బిగ్ బాస్-1లో శింబు ఓవియాకు సపోర్ట్ చేశాడు. అంతేకాదు తాజాగా ఓవియా నటించిన “90ఎమ్ఎల్”లో శింబు అతిథి పాత్రలో కన్పించనున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఓవియాకు శింబు ప్రస్తావన రాగా… ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా పుట్టొచ్చని, శింబు తనకు మంచి స్నేహితుడని… ఆయన స్నేహాన్ని జీవితాంతం కోరుకుంటున్నానని, తాను శింబుతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటానని స్పష్టం చేసింది.