నటి సురేఖ వాణి పేరు ఈ మధ్య అందరి నోట్లో నలుగుతుంది. భర్త చనిపోయిన తరువాత సురేఖ పేరు ఇంకా పాపులర్ అయ్యిందనడంలో సందేహం లేదు. ఈ మధ్య సురేఖ వాణి, తన కూతురు సోషల్ మీడియాలో డాన్స్‌లతో రెచ్చిపోయారు. అంతేకాకుండా ఆ మధ్య రెండో పెళ్ళి చేసుకోబుతున్నట్లు బాగా ప్రచారంలో అయ్యింది.
తాజాగా బిగ్‌బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై సురేఖవాణి క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్‌బాస్ షోకి వెళ్లడం లేదని, దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలను రాయకండి అంటూ.. సురేఖ వాణి కూతురు సుప్రీత తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.ఆ విషయం గురించి తన తల్లి ఎలాంటి విషయం చెప్పలేదని తెలిపింది.
దీంతో సురేఖ వాణి బిగ్‌బాస్ షోకి వెళ్లడం లేదని ఓ క్లారిటీకి వచ్చేలోపే.. ఆ పోస్ట్‌ని డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాల్లో దాన్ని ఇన్‌స్టా సోరీ నుంచి తొలగించింది. దీంతో ఆమె బిగ్‌బాస్‌లోకి ఆమె ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది మరోసారి ప్రశ్నార్థకంగానే మారింది.