telugu navyamedia
సినిమా వార్తలు

“బ్యాక్ డోర్” ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన..

లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన “బ్యాక్ డోర్” ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం టీజర్ పది మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా… ట్రైలర్ ఆ మార్కును సునాయాసంగా దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి ఈ చిత్రానికి ఇప్పటికే గల క్రేజును మరింత పెంచుతోంది.

“బ్యాక్ డోర్” ట్రైలర్ కు లభిస్తున్న స్పందన చిత్ర విజయంపై తమకు గల నమ్మకాన్ని మరింత పెంచుతోందని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. “బ్యాక్ డోర్” చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Telugu Movie Gallery | Telugu Movie Wallpapers | Telugu Movie Pics | Telugu  Cinema Stills

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై ‘నంది అవార్డు గ్రహీత’ కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రానికి “క్లీన్ యు” సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే.

 

Related posts