సుకుమార్ తన తదుపరి సినిమాను మహేశ్ తో చేయాలనే ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేసుకోవడం, ఆ కథ మహేశ్ బాబుకు అంతగా నచ్చకపోవడం, మరో కథను తయారు చేయడానికి సుకుమార్ కొంత సమయాన్ని తీసుకోమనడం తెలిసిందే. ఈ గ్యాప్ లోనే అనిల్ రావిపూడితో చేయడానికి మహేశ్ బాబు ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో ఆయన తీరికలేకుండా ఉన్నాడు.
తాజాగా, సుకుమార్ మళ్ళీ మహేశ్ బాబును కలిసి ఒక లైన్ చెప్పాడం, అది తనకి బాగా నచ్చేసిందని చెప్పి .. పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయమని అన్నాడని సమాచారం. ఇంతవరకూ తానెప్పుడూ రెండు సినిమాలను సమాంతరంగా చేయలేదనీ, వీలైతే అనిల్ రావిపూడి సినిమాతో పాటు .. ఈ సినిమా కూడా చేసేస్తానని మహేశ్ బాబు అన్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
స్టేజీపై హీరోతో హీరోయిన్ వెటకారం… కార్తీ కౌంటర్…