telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సురేందర్‌ రెడ్డి‌ దర్శకత్వంలో అఖిల్… అధికారిక ప్రకటన

akkineni

అక్కినేని అఖిల్ కెరియ‌ర్‌లో 5వ సినిమా ఎవ‌రితో చేయ‌నున్నారు అనే స‌స్పెన్‌ను తెర‌దించుతూ సినిమా వివరాల‌ను అఖిల్ అనౌన్స్ చేసేశాడు. సైరా’తో సూపర్‌హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ న‌టించ‌నున్నారు. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేంద‌ర్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతవరకూ సరైన హిట్ ఖాతాలో వేసుకోలేకపోయిన అఖిల్.. త‌న ఐద‌వ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇటీవలే ‘సైరా’తో చారిత్రాత్మక సినిమాతో హిట్‌ సాధించి తన సత్తా చాటాడు దర్శకుడు సురేందర్‌ రెడ్డి‌. మ‌రి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వ‌చ్చే సినిమా కాబ‌ట్టి మంచి స్టయిలిష్‌ సినిమానే రాబోతుంద‌న్న‌మాట. ఇక బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే చిత్రం ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక సురేందర్ రెడ్డి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Related posts