telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒక్క మేకతో .. మూడు కోట్లు నష్టపోయిన సంస్థ.. ఎలాగంటే..

company lost 3 crores for a goat

మేక ఖరీదు మహా అయితే వేళల్లో ఉంటుంది.. దానికి కోట్ల నష్టం ఎలా అనుకుంటే పొరపాటే.. ఈ ఒక్క మేక చావుతో ఓ కంపెనీకి సుమారు 3 కోట్ల పైగానే నష్టం వాటిల్లిందని సదరు కంపెనీ బావురుమంటోంది. ఇంత నష్టం రావడానికి కారణం ఓ గ్రామంలో ఉన్న ప్రజలే అంటూ వారిపై కేసులు పెడుతోంది. అసలు విషయం ఏమిటంటే…ఒడిస్సా లో మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ గనుల నుంచీ బొగ్గుని తీస్తుంది. అక్కడి నుంచీ రైల్వే వ్యాగన్లకి బొగ్గు సరఫరా చేస్తారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న గ్రామానికి చెందిన ఓ మేకని సదరు కంపెనీ కి చెందిన లారీ గుద్దేసింది. దాంతో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, మేక గల వ్యక్తి లారీని ఆపి నిరసనకి దిగారు. మేక చనిపోయినందుకు గాను తమకి 60వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన ఉదయం 11 గంటలకి మొదలైన సాయంత్రం 2-30 వరకూ కొనసాగింది. దాంతో విసుగు చెందిన కంపెనీ పోలీసుల సాయంతో అందరిని చెదరగొట్టారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. మేక ఖరీదు 60 వేలు అనుకుంటే అది కంపనీ చెల్లించి ఉంటే మేక 3 కోట్ల నష్టం ఎలా వచ్చింది అంటూ ఆలోచిస్తున్నారా. కానీ ఆ గ్రామం ప్రజలు సుమారు 3 గంటల పాటు ధర్నా చేయడం వలన సదరు కంపనీ సకాలంలో బొగ్గు ని సరఫరా చేయకపోవడంతో ఆలస్యం కారణంగా రైల్వే కి దాదాపు 1.50 కోట్లు చెల్లించ వలసి వచ్చిందట అంతేకాదు ఇతరాత్ర కారణాలు వెరసి సుమారు 3 కోట్ల పైమాటే. దాంతో ఆ కంపెనీ ఇప్పుడు ఆ గ్రామ ప్రజలపై కేసులు పెట్టిందిట.

Related posts