మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొద్ది రోజుల క్రితం ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి జాకబ్ గ్రిగరీ హీరోగా చిత్రాన్ని చేశాడు. అయితే తన ప్రొడక్షన్ సంస్థ లోగోతో పాటు పేరుని ప్రకటించని దుల్కర్ సల్మాన్ ఇదే సరైన సమయం అని భావించి తన సోషల్ మీడియా వేదికగా టైటిల్ అనౌన్స్ చేశాడు. వేఫారర్ ఫిలింస్ అనే పేరుని తన సొంత ప్రొడక్షన్ సంస్థకి ఫిక్స్ చేసిన దుల్కర్ లోగో కూడా రివీల్ చేశారు. వేఫారర్ అనే పేరు పెట్టడానికి ఓ కారణం కూడా ఉందని అంటున్నాడు దుల్కర్. మార్గ నిర్ధేశం కూడా తెలియని భూభాగంలో ప్రయాణికుడు ఎలా ప్రయాణిస్తాడో, సినిమా ప్రయాణంలోను తన బేనర్‌పై అదే జరగాలని కోరుకొని ఆ పేరు ఫిక్స్ చేశారట. ఈ బేనర్‌పై కొత్త దర్శకుడు అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుండగా, ఇందులో సురేష్ గోపి, శోభన, డిక్యూ, కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ “మహానటి” చిత్రంలో జెమినీ గణేష్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైన సంగతి తెలిసిందే.
previous post