telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ థియేటర్లో “సైరా” వీక్షించిన బన్నీ

Allu-Arjun

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. కాగా… తాజాగా మెగా కుటుంబం నుంచి బన్నీ కూడా సైరా సినిమాను చూసాడు.ఇప్పటికే ఈ కుటుంబంలో అంతా సినిమా చూసారు. సుదర్శన్ థియేటర్‌లో మెగా ఫ్యామిలీ అంతా వచ్చి తొలిరోజే సినిమా చూసింది. ఇక ఇప్పుడు బన్నీ కూడా ఏఎంబి సినిమాస్‌లో సైరా సినిమాను చూసాడు. కుటుంబంతో వచ్చి మెగా సినిమాను ఎంజాయ్ చేసాడు స్టైలిష్ స్టార్. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి.. కుమారుడు అయాన్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి నటనకు ఫిదా అయిపోయాడు అల్లు అర్జున్. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు బన్నీ.

Related posts