telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్షన్ సన్నివేశాలలో బిజీగా వున్న గోపీచంద్‌

gopichand

గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ‘సీటీమార్’ అనే సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌‌లో పాత్రలో నటిస్తోంది. దీనికి సంబందించి ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ పై ట్రైన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సపంత్ నంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ ట్రైన్ సీక్వెన్సెస్ పూర్తి యాక్షన్ తో సాగుతుందట. సినిమాలోనే హైలైట్ గా నిలువనుందని టాక్. ఈ పోరాట సన్నివేశాల్లో తమన్నా కూడా పాల్గొంటోంది. ‘సీటీమార్’‌కు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు.

Related posts